ఈ రత్నము కేతు గ్రహానికి సబంధించింది. వైడూర్యాన్ని ఆంగ్లంలో ‘క్యాట్స్ ఐ’ (Cats eye) అంటారు. రాత్రివేళ పిల్లి కళ్ళలో హెడ్ లైట్స్ వెలుగు పడినప్పుడు ఆ కళ్ళలో ప్రతిఫలించే రంగులు ‘వైడూర్యం’లోనూ మనకు కనిపిస్తాయి. పల్చని హనీబ్రౌన్, యాపిల్ గ్రీన్ రంగుల్లో వైడూర్యం ఉంటుంది.
ఈ రత్నానికి దాని తాలూకు లస్టర్, రంగులోని రిచ్‌నెస్, ఐ తాలుకూ షార్ప్ నెస్, క్లారిటీలతో షేప్ ని అనుసరించి విలువ నిర్ణయించడం జరుగుతుంది. ఇన్ సైడ్ బ్యాండ్ బ్రిలియంట్ గా, స్త్రెయిట్ గా ఉంటే వైడూర్యం నాణ్యతగా చెప్పబడుతుంది. అలాగే కొన్ని వైడూర్యాలు ‘మిల్క్ అండ్ హనీ’ ఎఫెక్ట్ వ్ ని ప్రతిఫలిస్తాయి. అంటే ఈ వైడూర్యం మీద ప్లాష్ లైట్ వేసినప్పుడు సగ భాగం తెల్లగా, మిగిలిన సగ భాగం తేనె రంగులో కనిపిస్తాయి. ఇది అంత విలువైన వైడూర్యంగా చెప్పరు. ప్లాష్ లైట్ వేసినపుడు పసుపు, తేనె రంగుల్లో కనిపించేది నాణ్యత గలదిగా చెప్పుకోవచ్చు.
వైడూర్య రత్నలు కేతు గ్రహానికి సంభంధించినవి. న్యాయ వివేచన, పుణ్యపాప వివక్షత, ధర్మాధర్మ పరిశీలనలు గల చిత్ర గుప్తుని అంశాల వల్ల ఈ వైడూర్య రత్నాలు పుట్టినట్లు కొందరు చెబుతారు. శరత్కాలంలో చంద్రుని యొక్క షోడస కళలు గల వెన్నెల కిరణలు కొన్ని రసాయన ధాతువులు కలిగిన శిలా భూముల్లో ప్రవేశించి అచ్చట రసధాతువులు గల శిలాభూములయందు ప్రవేశించి అచ్చటి రసధాతువులుగల శిలలకు చంద్ర కిరణములకు కలిగే పరస్పర సంయోగం వలన ఆ శిలలు కొంత కాలానికి వైడూర్య రత్నాలుగా మారతున్నవని కొందరి అభిప్రాయం.
ఎప్పుడు ధరించవచ్చు..?
అశ్వని, మఘ, మూల జన్మ నక్షత్రాలుగా కలిగియున్నవారు వైడూర్యాన్ని ఏ సమయములోనైనను ధరించవచ్చును. మిగిలిన నక్షత్రములు గలవారు తమ జన్మ కాలమందలి గ్రహస్థితి ననుసరించి కేతువు యొక్క దోషప్రదమైన సమయంలో ఈ రత్నము ధరించడం మంచిది. జన్మజాతకములందు శుభ స్థానములందు కేతువు బలహీనుడై ఉన్నప్పుడు వైడూర్యధారన చేసిన ఆ కేతువు సకల శుభముల నొసగును.
వైడూర్యాల ద్వారా కలిగే శుభయోగాలు
ఉత్తమ జతికి చెందిన దోషరహితమైన వైడూర్యంను ధరిస్తే జీవితం అభివృద్దిదాయకంగా ఉంటుంది. అంతేగాక ఆర్ధిక పుష్టి కృషిలో రాణింపు ఉద్యోగ ప్రాప్తి అధికారము జనాదరణ పలుకుబడి, కీర్తి గౌరవ మర్యాదలు, భోగ భాగ్య సంపదలు వాహన ప్రాప్తి గృహ లబ్ది, కళత్ర సౌఖ్యము, కుటుంబ సుఖశాంతులు శతృనాశనము, జయము కార్యశిద్ది దేహా రోగ్యము, సకల వ్యాధినాశనము, ఆయువృద్ది, అరిష్టనివారణ, దుష్టగ్రహ బాధా విముక్తి, దేవతానుగ్రహము సుఖము శాంతి సద్భావన, సజ్జన స్నేహము, సర్పదోష పరిహారము, సంతానప్రాప్తి, వంశాభివృద్ది కలుగగలవు. వైడుర్యము అత్యంత మహిమాన్వితమైనదగుట వలన దీన్ని ధరించెడి వాడికి సకల క్షేమం కలుగ చేయగలదు. ప్రసవకాలంలో స్త్రీలకు కలుగు అనేక బాధలు నివారించి సుఖముగా శీఘ్రంగా ప్రసవం చేయింపగలరు. ఈ రత్నంను నీటియందుంచి ఆ నీటిని ప్రసవ స్త్రీలచే త్రాగించిన శీఘ్రముగా ప్రసవించుటయే గాక ప్రసవానంతరం సంభవించే దుష్టలక్షణముల నుండి పూర్తిగా రక్షణ కలిగించగలదు.. చర్మ వ్యాధులు గలవారు ఈ వైడుర్యము ఆదివాసం గావించిన నీటిచే స్నానం చేసిన అనతి కాలంలోనే చర్మ వ్యాధుల నుండి విముక్తులై ఆరోగ్యవంతులు కాగలరు. గృహం నందలి సింహద్వారామునకు పైభాగమున వైడూర్యములు తాపటము జేయించిన ఆ గృహమునందు నివశించే వారికి అమ్మవారు ఆటలమ్మ, తడపర, కలరా, మొదలగు బాధించవు.
వైడూర్య రత్నము అమోఘమైన శక్తి సంపన్నమై యున్నది. ఇది ధరించిన శతృవులు సైతం మితృలుగా మారిపోగలరు. పగవారు చేయు చేత బడి, ప్రయోగములు మొదలగు కృత్రిమములు భూత భేతాళ, యక్ష రాక్షస, శాకినీ, కామినీ మొహినీ, గ్రహబాధలు దరిజేరలేవు. దీని వలన జీవితములో మంచి అభివృద్ది, మేధాశక్తి, ఆలోచనా పటిమను, కర్య సాధన, జనాకర్షన, జనరంజనలకీ వైడూర్యమును మించిన రత్నము మరొకటి లేదు.
వైడూర్యము ధరించే పద్ధతి
మంగళవారం, అశ్వని, మఖ, మూల నక్షత్రాల రోజున వైడూర్యమును ధరిస్తే భూతప్రేత పిశాచ బాధలు ఉండవు. సంతాన సుఖం, ధనవృద్ధి, శత్రు భయాలు నశిస్తాయని రత్నాల శాస్త్రం చెబుతోంది. “ఓం ఐం హ్రీం కేతవే నమ:”ను ఏడువేల సార్లు పఠించి ఎడమచేతి చిటికెన వేలుకు ధరించగలరు. ధరించే ముందు ఉలవలు, ఖర్జూర ఫలములు, కొబ్బరికాయ, కంబళి, వస్త్రం, కస్తూరిని దానం చేయాలి.
శివాలయములోని నవగ్రహముల మండపములోని కేతు విగ్రహము వద్ద ఉంగరం వుంచి కేతు అష్టోత్తరము చేయించి 1 1/4 కేజీల ఉలవలు నల్లని వస్త్రములో దానం చేయగలరు. మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటలలోపుగా శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకములో ఉంగరము ఉంచి శుద్ధి చేయగలరు. గణపతి క్షేత్రమును దర్శించినప్పుడు బ్రాహ్మణుడితో ఏడువేల సార్లు కేతు వేదమంత్రం జపము చేయించి ఉంగరానికి ధారాదత్తం చేయగలరు. కనీసం ధరించే వ్యక్తి కేతు ధ్యాన శ్లోకము 70 మార్లు పారాయణ చేసి ధరించగలరు. బుధవారం ఆశ్లేష, మాఘ, మూల నక్షత్రం రోజున రవి పుష్యకాలంలో ధరించవచ్చును.
దోషరహితమైన ఉత్తమజాతికి చెందిన ప్రకాశవంతమైన వైడూర్యం, బంగారం లేదా వెండితో లేదా పంచలోహాలతో తయారు చేయబడిన ఉంగరం నందు ఇమిడ్చి ధరించాలి ఉంగరం అడుగు భాగం రంద్రమును కలిగి ఉండే విధంగా పైభాగం ద్వజాకారం లేదా వర్తుల, చతురస్రాకారము గలిగిన పీఠమును ఏర్పరచి దాని మధ్యభాగంలో సూత్రం పైకి కనిపించే విధంగా వైడూర్యమును బిగించి, శుద్దిగావించిన పిమ్మట శాస్త్రోక్తముగా షోడశోపచార పూజలు నిర్వర్తించి శుభముహూర్తమున ధరించాలి కేతుగ్రహస్తమైన సూర్య చంద్రగ్రహణములు సంభవించిన కాలంలో వైడూర్య రత్నాన్ని ఉంగరంలో బిగించడం చాలా ఉత్తమం మరియు, మూలా, ఉత్తరాషాడ, ధనిష్ఠ అను నక్షత్రములచే కూడివచ్చిన అమావాస్య ఆదివారం యందు గానీ మృగశిర 1-2 పాదములయందు గానీ, ఉత్తర నక్షత్రములు గల సోమవారంగానీ శ్రావణమాసంలో శుక్లపంచమి, పూర్ణిమాతిదులయందుగానీ వర్జ్య దుర్ముహుర్తములు లేకుండా చూచి రవి లేదా చంద్ర హోరాలు జరిగే సమయంలో వైడూర్య ఉంగరమును బిగించాలి. ఆ తర్వాత దానిని ఒక దినమంతయు ఉలవ నీటియందుంచి, మరుసటి రోజు పంచ గవ్యములందు, మూడవదినము తేనెను కలిపిన నీటియందు నిద్ర గావింపజేసి శుద్ధోదకము చేత పంచామృతము చేత స్నానము గావింపజేసి ఆ ఉంగరమును శాస్త్రోక్తవిధిగా ధూపదీప నైవేద్యములచే షోడశోపచార పూజలు గావింపజేసిన పిమ్మట అనుకూలమైన శుభముహుర్తాన చేతికి ధరించవలెను.